ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారుతుందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం ప్రకటన చేసింది. దీనివల్ల ఇవాళ మరియు రేపు మోస్తారు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అలాగే బుధవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ.
రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్డు తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.