సెల‌వుల పై యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణ‌యం

-

వారాంత‌పు సెల‌వుల పై యూఏఈ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణయం తో ఇక నుంచి దుబాయ్, అబుదాబీ, షార్జా వంటి న‌గ‌రాల్లో సెల‌వు దినాలు మార‌నున్నాయి. యూఏఈ లో ఇప్ప‌టి వ‌ర‌కు శుక్ర వారం, శ‌నివారం సెలవు దినాలు గా ఉండేవి. అయితే యూఏఈ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తో సెల‌వు దినాలు మారుతున్నాయి. ఇక నుంచి యూఏఈ లో వారాంత‌పు సెల‌వు దినాలు గా శ‌ని వారం, ఆది వారం ఉండ‌నున్నాయి.

అంతే కాకుండా వారాంత‌పు సెల‌వు దినాలు శుక్ర వారం మ‌ధ్యాహ్నం నుంచే ప్రారంభం కానున్నాయి. అంటే దుబాయ్ అబుదాబీ, షార్జా వంటి న‌గ‌రాల్లో వారం లో ప‌ని దినాలు కేవ‌లం నాలుగున్న‌ర రోజులు అన్న‌ట్టే. అలాగే రెండున్న‌ర రోజులు సెలవు దినాలుగా ఉంటాయి. ఈ నిర్ణ‌యాన్ని రాబోయే న్యూయ‌ర్ రోజు నుంచి అమ‌లు చేయ‌డానికి యూఏఈ ప్ర‌భుత్వం స‌న్నద్ధం అవుతుంది. జ‌న‌వ‌రి 1 శుక్రవారం మ‌ధ్యాహ్నం నుంచే యూఏఈ లో వారాంత‌పు సెల‌వులు ప్రారంభం కాబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news