పాఠశాలల మూసివేతపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ…

-

విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో పలు గురుకులాల్లో, పాఠశాలల్లో కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పాఠశాలలను మళ్లీ మూసి వేస్తారని సోష్ మీడియాలో ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. స్కూళ్ల మూసివేతపై పుకార్లు నమ్మవద్దని ఆమె అందరిని కోరారు. పాఠశాలల్లో అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు.

sabita indra reddy

సూళ్లల్లో అక్కడక్కడా స్వల్పంగా కేసులు నమోదవుతున్నాయని వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. విద్యార్థులు ఇప్పటికే రెండేళ్ల విద్యా సమయాన్ని నష్టపోయారని…వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్కూళ్లలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తాం. ఏదైనా ఉంటే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news