అమెరికాలో అధ్యక్ష పదవి కోసం 2024 నవంబరులో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పుడే ఆశావహ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ రేసులో రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న వివేక్ రామస్వామి తన ప్రసంగాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా మరోసారి పదవి దక్కించుకోవాలని ఆరాట పడుతున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజాగా వాషింగ్టన్ పోస్ట్, ABC న్యూస్ సంయుక్తంగా పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వెనకబడ్డారు. డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చితే బైడెన్ 10 పాయింట్ల వరకూ బైడెన్ వెనకబడినట్లు పోల్ ఫలితాలు వెల్లడించాయి. 51-42 తేడాతో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నట్లు ఆ పోల్ పేర్కొంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో మిగిలినవారి కంటే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీ అధికారిక నామినేషన్ ప్రక్రియ అయోవా కాకస్, న్యూహాంప్ షైర్ ప్రైమరీతో జనవరిలో ప్రారంభం కానుంది. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు భారత సంతతికి చెందిన నిక్కీహేలీ, వివేక్ రామస్వామి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. వారు తమ ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తున్నా.. వారిద్దరి కంటే ట్రంప్ చాలా మందు ఉన్నట్లు సమాచారం.