యూకే సర్కార్.. విదేశీ విద్యార్థులకు ఝలక్ ఇచ్చింది. యూకే యూనివర్సిటీల్లో చదువుతోన్న విద్యార్థులు.. అక్కడ చదివేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విదేశీ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల గురించి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఏమన్నారంటే.. ?
‘బ్రిటన్ కొత్త వీసా నిబంధనల ప్రకారం.. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు. జులై 17, 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పరిశోధన ప్రోగ్రామ్‌గా గుర్తించిన పీజీ కోర్సులో నమోదైతే తప్ప.. తమపై ఆధారపడిన వారిని తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతి లేదు. జనవరి 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022లో ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 1.39లక్షలు (తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్-టైం ఉద్యోగంపై ఆధారపడిన వారు మినహా ఈ కొత్త వీసా రూల్స్ అందరు విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయని’ జైశంకర్ తెలిపారు.