రష్యాలో 1000 చ.కి.మీ ఆక్రమించిన ఉక్రెయిన్!

-

ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం ఇంకా జరుగుతోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్లోని పలు భూభాగాలను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశం రష్యాకు షాక్ ఇచ్చింది. రష్యాలోని కస్క్ ప్రాంతంలో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని జెలెన్స్కీ దేశం ఆక్రమించుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కీ ధ్రువీకరించారు. కస్క్‌లో ప్రస్తుత పరిస్థితిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి వివరిస్తూ.. ఇరు దేశాల బలగాల మధ్య యుద్ధం సాగుతోందని తెలిపారు.

కస్క్లో తమ సైనికులు పోరాడుతున్నారని జెలెన్స్కీ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మానవతా సాయం అందిస్తామని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడిన విషయం తెలిసిందే. రష్యా ఆధీనంలో ఉన్న ఈ ప్లాంట్‌లో ప్రమాదానికి కారణం మీరేనంటే మీరేనంటూ ఉక్రెయిన్, రష్యా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news