నీరజ్ చోప్రాతో పెళ్లి రూమర్స్.. వైరల్ వీడియోపై మను బాకర్ తండ్రి క్లారిటీ

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్కు రెండు కాంస్య పతకాలు అందించిన స్టార్ షూటర్ మను బాకర్, రజత పతకం అందించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్‌ చోప్రాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట రూమర్స్ షురూ అయ్యాయి. దీనిపై తాజాగా షూటర్ మనుబాకర్ తండ్రి క్లారిటీ ఇచ్చారు.

మను ఇంకా చిన్నపిల్ల అని.. ఆమెకు పెళ్లి వయసు కూడా రాలేదని మను తండ్రి రామ్‌ కిషన్ బాకర్ చెప్పారు. తాము ఆసలు తమ కుమార్తె వివాహం గురించి ఆలోచనే చేయడం లేదని అసలు సంగతి చెప్పుకొచ్చారు. మరోవైపు మను తల్లి నీరజ్‌తో మాట్లాడడం.. తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడంతో ఈ ఊహాగానాలు ఇంకో రేంజ్కు వెళ్లిపోయాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని నీరజ్‌ను మను అమ్మ కోరినట్లు కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. దీనిపైనా రామ్‌కిషన్ మాట్లాడుతూ.. నిజానికి వాళ్ల మధ్య జరిగింది ఏంటన్నదానిపై తనకూ క్లారిటీ లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news