రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. ఇటీవల ఉక్రెయిన్ చేసిన మిస్సైల్ అటాక్లో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఇటీవల ఉక్రెయిన్ చేసిన దాడిలో రష్యాకు చెందిన భారీ నౌకలు దెబ్బతిన్నాయి. రష్యాకు నల్లసముద్రంపై తిరుగులేని ఆధిపత్యం అందించిన సెవెస్తపోల్ నౌకాశ్రయం ఇప్పుడు ఉక్రెయిన్ దాడులకు టార్గెట్గా మారింది. ఈ దాడుల్లో కిలోక్లాస్ సబ్‌మెరైన్ కూడా క్షిపణి దాడిలో దెబ్బతింది. ఈ విషయాన్ని బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాలు రెండ్రోజుల క్రితం ధ్రువీకరించాయి.
సెప్టెంబర్ 13న ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు సెవెస్తపోల్‌లోని సెవ్మోర్‌జవోడ్ షిప్‌యార్డ్‌పై విరుచుకుపడ్డాయని బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అక్కడే ఉన్న ల్యాండిషిప్ మిన్స్క్ ఈ దాడిలో దెబ్బతిందని.. దీంతోపాటు నిర్వహణ పనుల నిమిత్తం అక్కడే నిలిపి ఉంచిన కిలో 636.3 శ్రేణికి చెందిన ‘రోస్తోవ్ ఆన్ డాన్’ సబ్‌మెరైన్ కూడా తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించింది. ఇటీవల ప్రపంచంలో శత్రు దాడుల్లో దెబ్బతిన్న జలాంతర్గామి ఇదే.