టీడీపీని పవన్ తన అధీనంలోకి తెచ్చుకుంటాడా ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా మలుపులు తీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతి చేశారన్న కేసులో 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నుండి చంద్రబాబును బయటకు తీసుకురావడానికి అనేక మంది కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ , లాయర్ లుత్రా లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ కేసులో కీలకమైన చాలా విషయాలు ముడిపడి ఉన్నందున కొంచం సమయం పట్టేలా ఉంది. అప్పటి వరకు టీడీపీ పరిస్థితి ఏమిటి ? నేతలు కార్యకర్తలు ఈ విధంగా ముందుకు వెళతారు అన్న విషయం పై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో టీడీపీ తో కలిసి వెళ్లనున్నారు అని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు చంద్రబాబు లోపల ఉండగా, పార్టీని లీడ్ చేయనున్నారు అన్నది ప్రశ్న. లోకేష్ కు అంత సామర్ధ్యం లేదని ప్రజలకు మరియు పార్టీ నేతలకు తెలుసు.. ఇక బాలకృష్ణ ఆవేశపరుడు… మాటలు తప్ప ఆలోచన ఉండదని చాలా మంది రాజకీయ నాయకుల నమ్మకం..

ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగో పొత్తులో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కు పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సరైన సమయం. మరి పవన్ మనసులో ఏముందో? ఏ విధంగా జనసేనాని ముందుకు వెళ్లనున్నారు తెలియాల్సి ఉంది.