ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా ముగింపు పలకాలని, వెంటనే రష్యా బలగాలు అక్కడి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. 193 సభ్యదేశాలు ఉన్న జనరల్ అసెంబ్లీలో.. 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగానూ, 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, చైనా సహా మరో 30 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఈ సమావేశంలో ప్రసంగించిన చైనా రాయబారి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు తాము మద్ధతునిస్తామని పేర్కొన్నారు. ఈ యుద్ధం విషయంలో బాధ్యుడిని, బాధితుడిని సమానంగా చూడలేమని.. ఐరోపా సమాఖ్య విదేశాంగ శాఖ చీఫ్ జోసెఫ్ బోరెల్ తెలిపారు.
భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భద్రతా మండలి ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. శాశ్వత శాంతిని భద్రపరచాలనే ఉద్దేశంతోనే తాము ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఇది యుద్ధయగం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేసిన ఆమె.. మనుషుల ప్రాణాలను పణంగా పెడితే సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదన్నారు.