ఫ్యూచర్ ను ఆస్వాదించాలంటే భారత్కు రండి.. అమెరికా రాయబారి ప్రశంసలు

-

భారత్పై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత దేశ అభివృద్ధి తనను ముగ్ధుణ్ని చేసిందని అన్నారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. భవిష్యత్ను ఆస్వాదించాలనుకుంటే.. అందుకోసం పని చేయాలనుకుంటే భారత్కు రండి అంటూ.. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు గర్వపడుతున్నానని గార్సెట్టి తెలిపారు. భారత్‌తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని అన్నారు. తాము ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదని, నేర్చుకోవడానికి వచ్చామంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్‌, అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని పేర్కొన్నారు.

మరోవైపు అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడిపై అభియోగాలు రావడం.. ఇరు దేశాల మధ్య బంధంపై ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దిఎరిక్‌ గార్సెట్టి మాట్లాడుతూ.. దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news