ఉషా చిలుకూరి.. రిపబ్లిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వాన్స్‌ సతీమణి మనమ్మాయే

-

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌ జె.డి.వాన్స్‌ పేరును ప్రకటించారు. మిల్వాకీలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపగా.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. అయితే వాన్స్ గురించి సెర్చ్ చేస్తుంటే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే…

జె.డి.వాన్స్‌ సతీమణి భారతీయ ములాలున్న వ్యక్తి కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్‌. ఆమె తల్లిదండ్రులు భారత్‌ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడగా.. ఉషా చిలుకూరి యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా వద్ద విధులు నిర్వర్తించిన ఆమె కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టిపెరిగారు. యేల్‌ లా స్కూల్‌లోన ఉషా, జె.డి.వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం.

Read more RELATED
Recommended to you

Latest news