తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి – కలెక్టర్లకు రేవంత్‌ ఆదేశాలు

-

తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామన్నారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని… ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని కొనియాడారు.

Chief Minister Revanth Reddy in the Collectors Conference at the Secretariat

కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు…. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు.
తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి…. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలని వెల్లడించారు.

క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి..కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదని వెల్లడించారు. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి….ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది…కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news