ప్రిగోజిన్​ది ముమ్మాటికే హత్యే.. అమెరికా నిఘా వర్గాల అంచనా

-

వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్ ప్రిగోజిన్​ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం వెనుక పుతిన్ కుట్ర ఉందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల రష్యాపై ప్రిగోజిన్ తిరుగుబాటు బావుటా ఎగురవేసి కొద్ది గంటల్లోనే వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అప్పుడే చాలా దేశాలు.. పుతిన్ అంత ఈజీగా తన శత్రువును వదిలిపెట్టరని వ్యాఖ్యానించాయి. ఇక తాజాగా ప్రిగోజిన్ మరణం.. ఆ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

అయితే ప్రిగోజిన్‌ను ఉద్దేశపూర్వక పేలుడుతోనే హత్యచేశారని అమెరికా నిఘావర్గాలు అంచనా వేశాయి. తన వ్యతిరేకుల నోరు మూయించే చరిత్ర ఉన్న పుతిన్‌ వైఖరి వల్లే ప్రిగోజిన్‌ విమానంలో పేలుడు జరిగిందని భావిస్తున్నట్లు వెల్లడించాయి. సాధారణంగా ప్రత్యర్థులకు దాడిచేసే అవకాశం ఇవ్వని ప్రిగోజిన్‌.. తనతో పాటు తన తర్వాత స్థాయిలో ఉండే లెఫ్టినెంట్స్‌ను కూడా వెంట తీసుకుని వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాగ్నర్‌ గ్రూపు.. రష్యాపై తిరుగుబాటు చేసినందుకు పుతిన్‌ ప్రతీకారం తీర్చుకున్నారనే విమర్శలు రష్యాలో వినిపిస్తున్నాయి.

మరోవైపు, వాగ్నర్ గ్రూప్ అనుకూల వార్తా ఛానెళ్లలో ప్రిగోజిన్ హత్యపై పలు కథనాలు ప్రసారమయ్యాయి. ప్రిగోజిన్​ది హత్యేనని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. క్షిపణిని ప్రయోగించి ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news