చంద్రయాన్​కు, చంద్రబాబు సంబంధమేంటి.. విజయసాయి రెడ్డి ఫైర్

-

ఊళ్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్లు చంద్రయాన్-3 సక్సెస్ పై చంద్రబాబు, ఎల్లో మీడియా హడావుడి చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రయాన్ స్పీడ్‌తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తోందని.. అక్కడ చంద్రయాన్ సక్సెస్ ఇక్కడ చంద్రబాబు సక్సెస్ అన్న టీడీపీ ప్రచారంపై స్పందించారు. అసలు చంద్రయాన్‌కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాజకీయంగా ఫ్రస్టేషన్ లో ఉన్న చంద్రబాబు ఏం చేయాలో తెలియక ఇలాంటి భజనలు చేయించుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని తెలిపారు. గురువారం రోజున ఆయన పల్నాడు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు జరుగుతున్నాయని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని విజయసాయిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news