హౌతీలపై అమెరికా రివేంజ్.. యెమెన్‌లోని స్థావరాలపై బాంబుల వర్షం

-

ఎర్ర సముద్రంలోవాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబల్స్ వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వీరిపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు ఇవాళ తొలిసారిగా ప్రతీకార దాడులు చేశాయి. ఇందులో భాగంగా ఈరోజు యెమెన్‌లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబులు విసిరాయి. లాజిస్టిక్‌ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్‌ వ్యవస్థలే లక్ష్యంగా టొమాహాక్‌ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డట్లు అమెరికా అధికారులు తెలిపారు.

గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని కొన్ని నెలలుగా వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఇది మానుకోవాలని ఇప్పటికే పలుమార్లు అమెరికా సహా పలు దేశాలు వారిని వారించాయి. కొన్నిసార్లు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈ దాడులు నిలువరించకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా హౌతీ రెబల్స్ పెడచెవిన పెట్టడంతో అమెరికా ప్రతీకార దాడులు షురూ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version