గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది : అమెరికా

-

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్ మిలిటెంట్లూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఇది పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలగజేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన నేపథ్యంలో బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం రోజున ఆయన ఆకస్మికంగా ఈ ప్రాంత పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2తో పాటు ఖతర్‌ ప్రధానమంత్రి షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ థానితో బ్లింకెన్‌ చర్చించారు. హమాస్‌ ఉప నేత సలేహ్‌ అరౌరీని లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోనే ఇజ్రాయెల్‌ హతమార్చిన నేపథ్యంలో బందీల విడుదల ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉంద ఈ భేటీలో పాల్గొన్న ఖతర్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అయినా తాము ఇరు పక్షాలతో చర్చలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version