‘వివేక్‌ రామస్వామి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు’ : ట్రంప్‌ వర్గం

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. అయోవా కాకసస్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యం కనబర్చారు. అయితే ఈ రేసులో చివరిలో నిలిచిన భారత సంతతి నేత వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయనకు ట్రంప్ ఉపాధ్యక్ష పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వర్గం నుంచి వివేక్‌ రామస్వామికి ఓ ప్రతికూల ప్రకటన వచ్చింది.

ట్రంప్‌నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని ఆ ప్రకటన స్పష్టం చేసింది. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌నకే భారీ మద్దతు లభిస్తోందని.. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి యత్నిస్తున్నారని ఈ ప్రకటనలో పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఆయన.. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించడానికి గతంలో సుముఖత వ్యక్తం చేయగా అప్పుడు దానిపై ట్రంప్‌ నుంచీ సానుకూల స్పందనే వచ్చిందని వెల్లడించింది. కానీ ఇప్పుడు ట్రంప్‌ వర్గం నుంచి భిన్నమైన స్పందన వచ్చిందని.. ఓటర్లు వివేక్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోకపోవచ్చు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరని ఆ వర్గం వెల్లడించినట్లు మాజీ అధ్యక్షుడి సన్నిహిత అనుచరుడిని ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version