హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం.. బయో ఏషియా సదస్సులో ప్రారంభం

-

దావోస్‌లో జరుగుతున్న 54వ ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో తెలంగాణకు ఓ సూపర్ ఛాన్స్ దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో ‘సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌(సీ4ఐఆర్‌)’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా-2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు అధ్యక్షుడు బర్గె బ్రెండ్‌ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బృందం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో ఈ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు బర్గె బ్రెండ్‌ తెలిపారు. దీనికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారాన్ని అందిస్తుందని వెల్లడించనున్నారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పంది్సతూ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకు సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపకల్పనలో ఈ కేంద్రం ద్వారా మార్గం సుగమమైందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version