అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడేందుకు ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆయన ప్రచారం కూడా షురూ చేశారు. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులు ఆయనకు మద్దతు కూడా పలుకుతున్నారు. తాజాగా టెస్లా అధినేత కూడా ఆయన గురించి పాజిటివ్‌గా ప్రచారం చేస్తూ.. సపోర్ట్ ఇస్తున్నారు.
ప్రచారంలో భాగంగా వివేక్.. మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ (CNN) టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పై మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఆపాలంటే ముందు చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పని తాను చేయగలనని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మాస్కోలో పర్యటించి.. చైనాతో దోస్తీని వదులుకునేలా పుతిన్‌కు ఒప్పిస్తానని వ్యాఖ్యానించారు వివేక్. తన విదేశీ విధానాల్లో ఇదే ప్రథమమైనది చెప్పుకొచ్చారు.