హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ బృందం..చర్లపల్లి జైలుకు చేరుకుంది. చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసేందుకు జైలు వద్దకు చేరుకుది మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీ బృందం. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఇక అటు ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ కొడంగల్ ఘటనపై కేటీఆర్ సంచలన పోస్ట్ పెట్టారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు. నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అంటూ మండిపడ్డారు.