కాలుష్యం వల్ల అనేక సమస్యలు వస్తాయని అనిదరికి తెలిసిందే. మానసిక సమస్యలు కూడా కాలుష్యం తో తలెతుత్తాయని ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ అనే జర్నల్ లో ఒక అధ్యయన నివేదిక ప్రచురితమైంది. దీని ద్వారా తేలిన విషయం ఏమిటంటే, వాయు కాలుష్యం కి స్వల్ప కాలం గురైన కూడా ఒకటి నుంచి రెండు రోజుల తర్వాత పిల్లల్లో మానసిక రుగ్మతలు అధికమవుతాయి అని తెలియజేశారు.
అమెరికాలోని సిన్సినాటి విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు కొన్ని విషయాలను బయట పెట్టారు. రోజు వారీ బహిరంగ వాయు కాలుష్యం వల్ల పిల్లల్లో ఆందోళన ఎక్కువ కలుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక వంటివి కూడా కలుగుతాయని పరిశోధకులు తెలిపారు. ముక్యంగా పెదాలు అధికంగా నివసిస్తున్న పరిసరాల్లో ఉండే పిల్లలకి వాయు కాలుష్యం వల్ల ప్రభావం ఎక్కువగా ఉందని తెలియచేస్తుంది. వాయు కాలుష్యానికి గురవడం వల్ల కౌమార దశ లో నిరాశ, ఆందోళన ఇతర మానసిక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అధ్యయనంలో తెలిపారు.