ఒక్క మ్యాచ్‌ను త‌గ్గించ‌కుండా పూర్తి స్థాయిలోనే ఐపీఎల్‌..!

-

ఈ ఏడాది అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌ల్లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఐసీసీ ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన ఆ ఐసీసీ ఈవెంట్ క‌రోనా కార‌ణంగా ర‌ద్దయింది. అయితే అదే స‌మ‌యంలో ఐపీఎల్‌ను నిర్వ‌హించేందుకు మార్గం సుగ‌మం అయింది. ఈ క్ర‌మంలో బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే ఇదే విష‌యంపై ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

full fledged ipl this time says ipl chairman brijesh patel

మ‌రో వారం లేదా ప‌ది రోజుల్లో ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం ఉంటుంద‌ని బ్రిజేష్ ప‌టేల్ తెలిపారు. అందులో ఐపీఎల్ తుది షెడ్యూల్‌పై చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. ఇక ఈ సారి క‌రోనా కార‌ణంగా ఐపీఎల్‌ను దుబాయ్‌లోనే నిర్వ‌హించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు. దుబాయ్‌లో టోర్నీని నిర్వ‌హిస్తే విదేశీ ప్లేయ‌ర్లంద‌రూ నేరుగా దుబాయ్‌కే చేరుకుంటార‌ని అన్నారు. ఈ క్ర‌మంలో మూడు లేదా నాలుగు వారాలు ముందుగా వారు టీంల‌తో క‌ల‌వాల్సి ఉంటుంద‌న్నారు.

ఇక క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను కుదించే అవ‌కాశం లేద‌న్నారు. మొత్తం 60 మ్యాచ్‌ల‌ను పూర్తి స్థాయిలో నిర్వ‌హిస్తామ‌ని, ఒక్క మ్యాచ్‌ను కూడా త‌గ్గించ‌బోమ‌ని ప‌టేల్ తెలిపారు. అయితే మ‌రికొద్ది రోజుల్లో ఐపీఎల్ టోర్నీ షెడ్యూల్‌పై బీసీసీఐ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేప‌థ్యంలో మ్యాచ్‌లు ఎప్పుడు జ‌రుగుతాయనే ఆస‌క్తి క్రికెట్ అభిమానుల్లో నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news