తిరిగి ప్రాక్టీస్ చేయడం ఆనందంగా ఉంది: రిషబ్ పంత్

-

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ లో కేంద్ర సడలింపులు ఇవ్వడంతో తిరిగి అన్ని రంగాలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానుండటంతో క్రికెటర్లు మళ్లీ కసరత్తు ప్రారంభించారు. టీమిండియా జట్టు క్రికెటర్లు మహ్మద్ షమి, చటేశ్వర్ పుజారా, సురేశ్ రైనా, రిషబ్ పంత్ తదితర క్రీడాకారులు బ్యాట్, బాల్ పట్టుకుని మైదానంలోకి అడుగేశారు.

rishab panth
rishab panth

యువ కీపర్ రిషబ్ పంత్, వెటరన్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా ఇద్దరూ కలిసి ఘజియాబాద్ లోని ఓ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రతినిధి రూపారమణి వారిద్దరినీ కలిసింది. దీంతో పంతో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 3 నెలల సుధీర్ఘ విరామం వల్ల బద్దకం బాగా పెరిగిపోయిందన్నారు. తిరిగి మ్యాచ్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ చేస్తుంటే ఉత్సాహం వస్తుంది. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్నీ రోజులు ఒకే చోట కూర్చొని ఇబ్బందులు ఎదుర్కొన్నాని, రైనాతో ప్రాక్టీస్ చేస్తూంటే అన్నీ మర్చిపోయినట్లు అనిపిస్తుందన్నారు. రైనా నుంచి మెళకువలు నేర్చుకుంటున్నానని, నాకు తెలియని విషయాలు తెలుసుకుంటానని చెప్పారు. కాగా త్వరలోనే బీసీసీఐ నేషనల్ జట్టు ఎంపికను మొదలుపెట్టనుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news