కిమ్ జోంగ్‌ కింగ్డమ్ లో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం శాసిస్తుంటారు. సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తులు, చివరకు హెయిర్‌స్టైల్‌పై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలు రెడ్‌ లిప్‌స్టిక్‌ వాడొద్దనే మరో నిబంధనను తీసుకొచ్చారు.

రెడ్‌ లిప్‌స్టిక్‌ను కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని భావిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో మేకప్‌పై నిషేధం ఉంది. వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారని కిమ్‌ భయపడుతున్నట్లు సమాచారం. లిప్‌స్టిక్‌ వేసుకోవడం కొరియా నియమాలకు విరుద్ధమని అక్కడి నాయకుల భావన. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారికి ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు విధిస్తారన్న విషయం తెలిసిందే.

అనేక ఫ్యాషన్‌ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో నిషేధం కొనసాగుతోంది. శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్‌, ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్‌ స్టైళ్లపై నిషేధం ఉంది. కిమ్‌ తనను ఎవరూ అనుకరించొద్దనే ఉద్దేశంతో అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version