చిలీలో కార్చిచ్చు బీభత్సం.. 13 మంది మృతి.. బూడిదవుతున్న అడవి

-

చిలీ అడవులను కార్చిచ్చు తగలబెడుతోంది. భయంకరమైన కార్చిచ్చుల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 190కి పైగా ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. వందలాది ఇళ్లను మంటలు దహించివేశాయని.. మొత్తం 14వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దహించుకుపోయిందని అధికారులు పేర్కొన్నారు.

భారీ గాలులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని చిలీ ప్రభుత్వం వెల్లడించింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలి పైలెట్ మృతి చెందినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 191 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా… 45 ప్రాంతాల్లో మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ ప్రకటించారు. కార్చిచ్చును అదుపు చేయడానికి అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుంచి విమానాలు రానున్నాయని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news