నార్తర్న్‌ ఐర్లాండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు గుర్తింపు

-

నార్తర్న్‌ ఐర్లాండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబును గుర్తించారు. కౌంటీ డౌన్‌ ప్రాంతంలో ఉన్న న్యూటౌనార్డ్స్‌లో బాంబు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా వెంటనే 400 మీటర్ల వ్యాసార్ధంలో ఉన్న ఇళ్లల్లోని ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తుండగా అనుమానిత వస్తువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాన్ని పరిశీలించి బాంబుగా తేల్చారు. బాంబు నిర్వీర్య దళాలు అక్కడికి చేరుకొని దాన్ని పరిశీలించి రెండో ప్రపంచ యుద్ధ ) కాలం నాటి పేలుడు వస్తువుగా గుర్తించారు. దాన్ని నియంత్రిత పేలుడు విధానంలో నిర్వీర్యం చేసేందుకు ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. దీంతో అధికారులు అక్కడి ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రానికి పంపించారు.రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించినా ప్రజల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news