అనాథ బాలికకు అండగా మంత్రి కోమటిరెడ్డి

-

నిర్మల్‌ జిల్లా తానూరు మండలం బెల్‌తరోడాలో ఓ బాలిక తన తల్లితో కలిసి జీవిస్తోంది. పాప చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసి తన బిడ్డను పోషిస్తోంది ఆ తల్లి. అయితే ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి జీవితంతో విసిగిపోయిన ఆమె మనస్తాపానికి గురై ఆదివారం రోజున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే లేచి చూసిన ఆ బాలిక బోరున విలపించింది. ఆమె ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఉన్న ఒక్క బంధం దూరం కావడంతో ఆ బాలిక అనాథ అయింది. కన్నతల్లికి దహనసంస్కారాలు జరిపించేందుకు కూడా ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో తల్లి మృతదేహాన్ని వదిలేసి, ఇంటి ముందు ఓ వస్త్రం వేసి దాని ఎదుట కూర్చుని అంత్యక్రియల ఖర్చుల కోసం యాచించింది. గ్రామస్థులు, పోలీసులు బంధువుల్లా అండగా నిలిచి ఆర్థిక సాయం చేయగా కొడుకులా మారి తలకొరివి పెట్టింది. అయితే అనాథగా మారిన ఆ చిన్నారికి పలువురు నేతలు సాయం చేస్తున్నారు.

తాతాగా ఆ బాలికను ఆదుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుకొచ్చారు. ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష సాయం చేశారు. చిన్నారి చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటానని మాటిచ్చారు. ఆమెకు ఇల్లు కూడా సమకూరుస్తానని హమీ ఇచ్చిన మంత్రి.. బాలికకు వీడియో కాల్‌ చేసి మాడ్లాడి ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news