మరో నాలుగు వారాల్లో ప్రపంచ యుద్ధం..హెచ్చరిస్తున్న రష్యన్ మిలటరీ విశ్లేషకుడు…!

Join Our Community
follow manalokam on social media

మరో నాలుగు వారాల్లో ప్రపంచ యుద్ధం జరగబోతోందని ఇండిపెండెంట్ రష్యన్ మిలటరీ ఎనలిస్ట్
ఫెల్గెన్‌హౌర్ చెప్పారు. అయితే రష్యన్ మిలటరీ మూమెంట్స్ ఆధారంగా దీనిని కనుగొన్నారు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఆయన చెప్పారు. రష్యా తీరు చూస్తుంటే తప్పకుండా మరో నాలుగు వారాల్లో ప్రపంచ యుద్ధం జరగబోతోందని చెప్పారు.

రష్యా సైనిక ఉద్యమం పై పశ్చిమ దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా యొక్క వోరోనెజ్, రోస్టోవ్ మరియు క్రాస్నోడార్ ప్రాంతాల లో సైనిక కదలికలను కొత్త ఫుటేజ్ లో కనపడ్డాయి. దీనితో పశ్చిమ దేశాలు వ్యక్తం చేసిన ఆందోళనలు సరైనవని ఫెల్గెన్‌హౌర్ అభిప్రాయ పడ్డారు. కొన్ని ఆధారాలని చూస్తుంటే అక్కడ పన్నెండు మిలిటరీ హెలికాప్టర్స్ సరిహద్దు కి దగ్గరలో ఉన్నట్టు కనబడుతున్నాయి. అలానే ట్యాంకులు మరియు ఇతర మిలిటరీ వాహనాలు కూడా అక్కడ ఉన్నాయి.

ఈ సంక్షోభం పాన్-యూరోపియన్ యుద్ధంగా మారే అవకాశం ఉంది, కాకపోతే ప్రపంచం కూడా. ఇది జరుగుతుందా లేదా? అనేది తెలియడం లేదు వేచి చూద్దాం. పాశ్చాత్య దేశాల లో, దీని గురించి ఏమి చేయాలో వారికి తెలియదు అని ఫెల్జెన్‌హౌర్ రోస్‌బాల్ట్ వార్తా సంస్థకు చెప్పారు.

ఇక్కడ పరిస్థితి చూస్తుంటే టెన్షన్స్ మరో ఎత్తుకు వెళ్లిపోయాయి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చెడు సంకేతాలు కనబడుతున్నాయి అని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఉక్రేనియన్ కి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ డిఫెన్స్ అఫీషియల్ లక్ష్మివారం నాడు మిలటరీ మూమెంట్స్ రష్యా లో జరుగుతున్నట్లు కనపడుతోందని వెల్లడించారు. ఒక పక్క రష్యా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. NATO మిలట్రీని ఉక్రేనియన్ లోకి పంపిస్తోంది.

రష్యాలో 32,700 మంది సైనికులు ఉన్నారని ఉక్రేనియన్ ఆరోపించింది. ఇది ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సంభవించే ఎటువంటి పరిస్థికి అయినా దేశం సిద్ధంగా ఉందని ఉక్రేనియన్ కమాండర్-ఇన్-చీఫ్ రుస్లాన్ ఖోమ్‌చక్ ఇటీవల వెల్లడించారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...