ప్రపంచలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతతం ఈయన వయసు 111 సంవత్సరాలు. సౌత్ పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న జాన్కు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ బృందం సర్టిఫికేట్ అందజేసింది. సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని జాన్ చెప్పారు.
ఆగస్టు 26వ తేదీ, 1912న జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వూడ్ జన్మించారు. టైటానిక్ నౌక మునిగిన కొన్ని రోజులకే ఆయన పుట్టారు. తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన జాన్.. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన.. ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని తెలిపారు. జాన్ తన లైఫ్లో ఎప్పుడూ ధూమపానం చేయలేదని, మద్యం మాత్రం అరుదుగా తీసుకునేవాడినని చెప్పారు. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్ పాటించలేదన్నారు.