చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. జిన్పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా అమోదించింది. అంతకుముందే గతేడాది జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. అత్యంత అరుదైన ఈ ఎన్నికతో.. మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా నిలిచారు జిన్పింగ్(69).
వాస్తవానికి చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 అయినప్పటికీ.. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన నేపథ్యంలో జిన్పింగ్ కొనసాగుతున్నారు. ఒక వ్యక్తి రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే.