హమ్మయ్య!! రాక్షసి వెళ్లిపోయింది.. హసీనాపై యూనస్ ఘాటు కామెంట్

-

బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశాన్ని వదిలి భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ దేశంలో కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌ (84) హసీనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె దేశాన్ని విడిచి వెళ్లిన నేపథ్యంలో హసీనాను ఉద్దేశించింది బంగ్లాదేశ్ నుంచి మాన్స్టర్ (రాక్షసి) వెళ్లిపోయిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా విద్యార్థులతో సమావేశమైన ఆయన.. ఆందోళనలను ముందుండి నడిపించిన విద్యార్థి సంఘాల నాయకులను ప్రశంసించారు.

విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లపం మొత్తం ప్రభుత్వాన్నే కూల్చేసి నిరంకుశ పాలనకు ముగింపు పలికిందని యూనస్ అన్నారు. దేశం నుంచి మాన్‌స్టర్‌ వెళ్లిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తిగా సయ్యద్ రెఫాత్ అహ్మద్ పేరును విద్యార్థి నాయకులు ప్రతిపాదించడంతో ఆయన్ను కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

మరోవైపు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి వెళ్లడానికి దారి తీసిన పరిస్థితుల్లో అమెరికా ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తామెప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆరోపణలను ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news