మోడీ సోదరికి రెడ్ కార్నర్ నోటీసులు!

-

నీరవ్ మోదీ సోదరి పూర్వీ మోదీకి సోమవారం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి రూ.13,578 కోట్లకు పైగా  రుణాలను ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన సోదరి పూర్వీ మోదీ ఈ కుంభకోణంలో నీరవ్ కి  సహాయమందించడంతో పాటు సింగపూర్, హాంగ్ కాంగ్ లోని కొన్ని సంస్థల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. గతంలో ఎన్ఫోర్స్ మెంట్ అభ్యర్థన మేరకు నీరవ్ మోదీకి సన్నిహితుడిగా ఉన్న మిహర్ భన్సాలికి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది.

ఇప్పటి వరకు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఐదుగురికి నోటీసులు జారీఅయ్యాయి. నీరవ్ మోదీ రుణాలు ఎగ్గొట్టడంతో పీఎన్బీ షేర్  విలువ పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ మాల్యా కోసం ఇండియాలోని పలు బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news