ప్రేక్షకులను భయపెడుతున్న ది నన్ చిత్రం.. రికార్డు స్థాయిలో వసూళ్లు..!

-

వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మాణంలో వచ్చిన కంజ్యూరింగ్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భయానికి చిరునామాగా నిలిచిన కంజ్యూరింగ్ సినిమాలు వసూళ్లను కూడా భారీగానే సాధించాయి. ఇక ఈ సినిమాల సిరీస్‌లో తాజాగా వచ్చిన చిత్రం ది నన్ (The Nun). ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణే లభిస్తుంది. అందులో భాగంగానే ది నన్ సినిమా గతంలో వచ్చిన కంజ్యూరింగ్ సినిమాల కన్నా భారీగానే వసూళ్లను రాబడుతోంది.

ది కంజ్యూరింగ్, అనాబెల్, ది కంజ్యూరింగ్ 2, అనబెల్: క్రియేషన్ చిత్రాలను వార్నర్స్ బ్రదర్స్ సంస్థ నిర్మించగా ఇవి ప్రపంచ వ్యాప్తంగా 1.1 బిలియన్ డాలర్లను వసూలు చేశాయి. 2013లో ది కంజ్యూరింగ్ సినిమా విడుదల కాగా అప్పట్లో ఈ సినిమా తొలి వారంలో 41.8 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే తాజాగా వచ్చిన ది నన్ చిత్రం మాత్రం 77.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

ది నన్ చిత్రానికి కోరిన్ హార్డీ దర్శకత్వం వహించగా డెమియన్ బిచిర్, టైస్సా ఫార్మి కీలక పాత్రల్లో నటించారు. 22 మిలియన్ డాలర్లతో ది నన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక కేవలం అమెరికా, కెనడాలలోనే ఈ చిత్రం ఇప్పటి వరకు 53.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి కంజ్యూరింగ్ చిత్ర రికార్డులను తిరగరాసింది. భారత్‌లోనూ ది నన్ సినిమాకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆదరణ కనబరుస్తున్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news