ముఖ్య గమనిక.. ఐసిఐసిఐ సేవలకు అంతరాయం..!

-

ప్రస్తుతం పండుగ సీజన్ లో వివిధ షాపింగ్ మాల్స్ అన్ని రకాల సంస్థలు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్ లు ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంతో మంది షాపింగ్ చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పలు బ్యాంకులకు సంబంధించి నెట్వర్క్ సమస్యలు కూడా వచ్చి ఎంతో మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రైవేటు రంగ దిగ్గజం బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ కస్టమర్లు పలురకాల సేవలకు అంతరాయం ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ లావాదేవీలు డెబిట్ కార్డు లావాదేవీల సర్వీసులు విషయంలో అంతరాయం ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు . ఈరోజు ఉదయం నుంచి ఐసిఐసిఐ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో సరైన రీతిలో సేవలు పొందలేకపోతున్నాము అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే ప్రస్తుతం ఎక్కువగా షాపింగ్ చేసేందుకు లావాదేవీలు నేపథ్యంలో సర్వర్ల పై ఒత్తిడి పెరిగి ఇలా పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు దీనిపై ఐసిఐసిఐ స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version