హేమా చల నరసింహ స్వామి క్షేత్ర విశేషాలు….!

-

మన దేశంలో నరసింహ స్వామి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. నవ నార సింహ క్షేత్రాలు ఎంతో పవిత్రమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రసిద్ధమైన ఒక పుణ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో స్వామి స్వయంభువుగా వెలిసినట్లు చరిత్ర చెపుతుంది. అయితే తెలంగాణ లోని వరంగల్ లో ఉన్న క్షేత్ర విశేషాలు చూద్దాం.

తెలంగాణా రాష్ట్రంలో వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో అందమైన కొండల మధ్య చిన్న గుట్టపై స్వయంభువు గా వెలిశాడు. ఇక్కడ స్వామి భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందాడు. ఈ దేవాలయం అతి పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మూల విరాట్టు విగ్రహం 9 అడుగుల నల్ల రాతి విగ్రహం కలదు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మెడ కింద భాగం అంతా నరుడిగా, తల భాగం సింహం రూపంలో ఉంటుంది. ఇలా ఆ స్వామి నిజ రూప దర్శనం ఇస్తున్నాడు.

ఒకప్పుడు స్వామి విగ్రహాన్ని పుట్టలో నుండి తవ్వి తీస్తుంటే స్వామి బొడ్డు భాగంలో పలుగు తగలడం వల్ల గాయం అయింది. అందుకే ఇప్పటికి పూజారులు ఆ గాయానికి చందనం రాస్తారు. ఈ విగ్రహం యొక్క మరొక విశేషం ఏమిటంటే విగ్రహాన్ని తాకినప్పుడు రాతిని పట్టుకున్నట్టు కాక మనిషి శరీరం పట్టుకున్నట్టు భావన కలుగుతుంది. ఇంకా ఇక్కడ స్వామికి నువ్వుల నూనె తో అభిషేకం చేస్తారు. దక్షిణ భారత దేశం లో ఎక్కడ కూడా ఇలా నువ్వుల నూనె తో అభిషేకం చేయరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version