చెన్నై లోని షిర్డీ సాయి ఆలయ విశేషాలు…!

-

మన దేశంలో షిర్డీ లో ఉన్న సాయిబాబా ఆలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. బాబా తన బోధలతోనే మనిషి లోని అజ్ఞానాన్ని తొలగించి సరైన మార్గం లో నడిపించే వాడు. అటువంటి సాయిని హిందువులు శివుని అవతారంగా కొలుస్తారు. అంతేకాక ప్రతి ఊరి లోను షిర్డీ సాయిబాబా ఆలయాలు నిర్మించి భక్తులు బాబా చేప్పిన బోధనల మార్గంలో పయనిస్తున్నారు. అలాంటి ఆలయాల్లో ఒకటి చెన్నై లో ఉన్న షిర్డీ సాయి మందిరం.

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నైలోని మైలాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. షిర్డీకి చెందిన భారతీయ సాధువు సాయిబాబాకు ఇది అంకితం. ఈ ఆలయాన్ని 1952 లో ఒక నరసింహస్వామి, ఒక సేలం మరియు సాయిబాబా భక్తుడు, ఒక చెట్టార్ వ్యాపారి విరాళంగా ఇచ్చిన డబ్బు నుండి నిర్మించారు. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన దేవాలయంగా ఇది పరిగణించబడుతుంది. ఈ ఆలయం అఖిల భారత సాయి సమాజ ప్రధాన కేంద్రం. ఆల్ ఇండియా సాయి సమాజ్ అనేది శ్రీ నరసింహ స్వామి ఏడు దశాబ్దాల క్రితమే స్థాపించిన సంస్థ, దీని ప్రధాన లక్ష్యం షిర్డీ యొక్క శ్రీ సాయిబాబా యొక్క జీవిత మరియు బోధనల యొక్క వ్యాప్తి.

బాబా తన చిన్నతనం నుండి అనేక బోధలు చేసేవాడు. తన నాలుగవ సంవత్సరం దేశంలో హిందూ, ముస్లిం గొడవలు జరుగుతున్న వేళ హిందూ దేవాలయంలోకి వెళ్లి అల్లా మాలిక్ అని, మసీదులోకి వెళ్లి రాముడే దేవుడు అని అరిచేవాడు. అంత చిన్న వయసులోనే అందరు సమానమే అని చాటి చెప్పాడు. బాబా ఒక మతాన్ని గాని, ఒక కులాన్ని కాని ప్రోత్సహించేవాడు కాదు. భక్తి, శ్రద్దలతో తనను తలచుకున్న వారిని బాబా ఆదుకుంటాడని భక్తుల నమ్మకం. పకీరు వేషంలో మానవాళిని తరింప చేయటానికి వచ్చిన దైవ స్వరూపుడు బాబా. అందుకే ప్రతి ఉరిలో బాబా ఆలయాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version