తాజాగా కొద్దిసేపటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేసే ఎలక్ట్రానిక్ డివైజ్ లలో ఓ సమస్య వెంటాడుతోంది. వారి ఫోన్ లో ఉన్న పింటరెస్ట్, స్పాటిఫై, టిండర్ లాంటి అప్లికేషన్స్ ఓపెన్ అవ్వట్లేదు. అయితే ఇది కేవలం ఐఫోన్ ఐపీఎల్ లో వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా క్రాష్ అవుతున్నాయి. నిజానికి ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా లోపం ఉందేమో అని చాలా మంది ఆందోళన చెందారు. అయితే నిజానికి ఇది ఏ రకమైన కారణమో తెలియకపోయినప్పటికీ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ లో ఏర్పడిన కారణంగా ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎవరైనా ఈ అప్లికేషన్స్ లో ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయిన యూజర్ కి ఇలాంటి లోపం బయటపడిందని అర్థమవుతోంది. మొత్తానికి ఫేస్‌బుక్ సంస్థలో ఏర్పడిన లోపం కారణంగా పింటరెస్ట్, స్పాటిఫై, టిండర్ అప్లికేషన్లలో భారీ మొత్తంలో ఓపెన్ కాకుండా క్రాష్ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.