4జి, 5జి వేరియెంట్ల‌లో విడుద‌ల కానున్న ఐఫోన్ 12 ఫోన్లు..?

-

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన కొత్త ఐఫోన్లు ఈసారి మ‌రింత ఆల‌స్యంగా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ త‌రువాతే ఐఫోన్ 12 ఫోన్ల‌ను విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ సారి విడుద‌ల కానున్న ఐఫోన్ల‌లో యాపిల్ 5జితోపాటు 4జి ఫీచ‌ర్‌తో విడిగా ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఐఫోన్ 12 మోడ‌ల్స్‌లో 4జి, 5జి వేరియెంట్లు క‌లిపి ఉంటాయ‌ని తెలిసింది.

iphone 12 4g variant may launch in 2021 February

4జి క‌నెక్టివిటీ క‌లిగిన ప్ర‌త్యేక ఐఫోన్ 12 వేరియెంట్‌ను కూడా యాపిల్ ఈ సారి విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. ఆ మోడ‌ల్ ధ‌ర‌ను సుమారుగా 800 డాల‌ర్లు(దాదాపుగా రూ.59వేలు)గా నిర్ణ‌యిస్తుంద‌ని తెలిసింది. అందువ‌ల్ల రానున్న ఐఫోన్ 12 సిరీస్‌లో 4జి క‌లిగిన ఐఫోన్ 12 మోడ‌లే ఎంట్రీ లెవ‌ల్ ఐఫోన్ 12 అవుతుంద‌ని తెలుస్తోంది. అయితే అక్టోబ‌ర్ త‌రువాత ఐఫోన్ 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌ను యాపిల్ 5జి స‌పోర్ట్ తో విడుద‌ల చేస్తుంద‌ని తెలిసింది. ఇక 2021 ఫిబ్ర‌వ‌రిలో ఐఫోన్ 12 4జి వేరియెంట్‌ను విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

ఐఫోన్ 12 సిరీస్‌లో విడుద‌లయ్యే ఫోన్లు 5.4, 6.1, 6.7 ఇంచుల డిస్‌ప్లే సైజుల‌ను క‌లిగి ఉంటాయ‌ని తెలుస్తోంది. అలాగే 6.1, 6.7 ఇంచుల ఫోన్ల డిస్‌ప్లేల‌కు రిఫ్రెష్ రేట్‌ను ఎక్కువ‌గా ఇస్తార‌ని తెలిసింది. అన్ని డిస్‌ప్లేలు ఓలెడ్ టైప్‌లో ఇస్తార‌ని, 5.4 ఇంచ్ మోడ‌ల్ ఎంట్రీ లెవ‌ల్ ఐఫోన్‌గా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అలాగే అన్ని ఐఫోన్ 12 అన్ని వేరియెంట్ల‌లోనూ స‌రికొత్త ఐఓఎస్ 14 ఓఎస్‌ను అందిస్తార‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news