ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్ల అమ్మ‌కాలు షురూ.. డిస్కౌంట్ల‌తో సేల్స్‌..

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవ‌లే విడుద‌ల చేసిన త‌న ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్ల‌కు గాను భార‌త్‌లో శుక్ర‌వారం నుంచి అమ్మ‌కాల‌ను ప్రారంభించింది. ఈ ఫోన్ల‌ను ఇటీవ‌లే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెన‌డా, చైనా, జ‌పాన్ దేశాల్లో విక్ర‌యించ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో వీటిని విక్ర‌యిస్తున్నారు. ఇక ఈ ఫోన్ల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను కూడా యాపిల్ అందిస్తోంది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌ను భార‌త్‌లో మ‌రో వారం త‌రువాత నుంచి విక్ర‌యించ‌నున్నారు.

iphone 12 and iphone 12 pro sales started in india

ఐఫోన్ 12కు చెందిన 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.79,900 ఉండ‌గా, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.84,900గా ఉంది. అలాగే 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.94,900గా ఉంది. ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ ధ‌ర రూ.1,19,900 ఉండ‌గా, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.1,29,900గా ఉంది. ఐఫోన్ 12 ప్రొ 512 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,49,900గా ఉంది.

యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొత్త ఐఫోన్ల‌ను కొన‌ద‌లిస్తే పాత ఐఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేయ‌వ‌చ్చు. పాత ఐఫోన్ల‌కు యాపిల్ చ‌క్క‌ని ధ‌ర‌ల‌ను కూడా అందిస్తోంది. దీంతో వాటిని ఎక్స్‌ఛేంజ్ చేసి ఆ మేర కొత్త ఐఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో ప‌లు బ్యాంకుల కార్డుల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌పై డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.