రేపు విడుద‌ల కానున్న ఐపీఎల్ షెడ్యూల్‌.. చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ అధికారిక ప్ర‌క‌ట‌న‌..

-

క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ రేపు విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ అధికారికంగా ప్ర‌క‌టించారు. శ‌నివార‌మే షెడ్యూల్‌ను విడుద‌ల చేస్తార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేయ‌నున్న‌ట్లు పటేల్ ప్ర‌క‌టించారు.

కాగా యూఏఈలో సెప్టెంబ‌ర్ 19 నుంచి జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ న‌వంబ‌ర్ 10వ తేదీతో ముగుస్తుంది. ఈ క్ర‌మంలో ఫ్రాంచైజీలు ఇప్ప‌టికే దుబాయ్ చేరుకున్నాయి. ఆయా జ‌ట్ల స‌భ్యులు ప్రాక్టీస్ కూడా మొద‌లు పెట్టారు. అయితే చెన్నై టీంలో కొంద‌రికి క‌రోనా సోక‌డంతో ఐపీఎల్ షెడ్యూల్ విడుద‌ల ఆల‌స్యం అయింది. కానీ ఎట్ట‌కేల‌కు షెడ్యూల్ విడుద‌ల కానుండ‌డంతో క్రికెట్ ప్రేమికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆరంభ మ్యాచ్‌లో చెన్నైకి బ‌దులుగా బెంగ‌ళూరును ఆడించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ చెన్నై టీమే ఆడుతుంద‌ని తెలుస్తోంది. అయితే అప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version