కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ.. ఎందుకంటే?

-

స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బాలకృష్ణ కేసీఆర్ కు ధన్యవాదాలు తెలపడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. తాజాగా స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితాన్ని తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా ముద్రించారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడు అయినప్పటికీ కేసీఆర్ మాత్రం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించడానికి అనుమతిచ్చారు.

తన తండ్రి జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల రూపంలో ముద్రించడంతో బాలకృష్ణ కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాఠ్యాంశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం, ఇతర పథకాల గురించి కూడా ప్రస్తావించారని సమాచారం. దీంతో బాలకృష్ణ ఫేస్ బుక్ వేదికగా పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.

బాలకృష్ణ తన పోస్టులో “తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని… కళకు, కళాకారులకు విలువ పెంచిన కథానాయకుడు ఎన్టీఆర్ అని… ఎన్నో ప్రజారంజక నిర్ణయాలు తీసుకుని ఎన్టీఆర్ ప్రజల ముంగిటకే పాలన తెచ్చారని… భారతదేశ పటంలో తెలుగు వాడికి, తెలుగు వేడికి ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దుబిడ్డ నందమూరి తారకరామారావు అని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా పదవ తరగతి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సోషల్ లో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ సర్కార్, తెలంగాణ సీఎం కేసీఆర్” కు ప్రత్యేక ధన్యవాదాలు అని బాలకృష్ణ పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version