రేపు ఐపీఎల్‌ 2022 వేలం..బరిలో 512 ఆటగాళ్లు

-

రేపు ఐపీఎల్‌ 2022 వేలం జరుగనుంది. బెంగళూరులో శనివారం, ఆదివారం ఈ వేలం జరుగనుంది. పాత 8 జట్లతో పాటు ఈ సీజన్‌లో కొత్తగా గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ సూపర్ జెయింట్స్ కూడా ఈ సారి వేలంలో పాల్గొననున్నాయి. ఆర్‌పీ సంజీవ్ గోయింకా గ్రూప్… లక్నో జట్టును 7090 కోట్లకు కొనుగోలు చేయగా… అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ 5625 కోట్లకు కొనుగోలు చేయనున్నారు. ఇక ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 590 మంది ఆటగాళ్లు పాల్గొంటారు.


228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నారు. ఐపీఎల్ వేలంలో వాడే రైట్ టు మ్యాచ్ కార్డు మాత్రం ఈ సారి అందుబాటులో ఉండడం లేదు. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా వేలంపాటలో వేరే జట్టు దక్కించుకున్న ప్లేయర్‌ని… అదే రేటుకి పాత ఫ్రాంఛైజీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశం ఉండదు. ఐపీఎల్ 2022 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో 90 కోట్ల రూపాయలు. ఇంతకుముందు ఈ వాల్యూ 85 కోట్లు ఉండగా… మరో రూ.5 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

Read more RELATED
Recommended to you

Exit mobile version