IPL 2023 : ఐపీఎల్ ఈవెంట్‌లో రష్మిక, తమన్నా డ్యాన్స్?

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఐపిఎల్ 2023 సీజన్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. దాంతో 16వ సీజన్ షెడ్యూల్ ని ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ల బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది.

మార్చి 31వ తేదీన తొలి మ్యాచ్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ధోని కెప్టెన్సీ వహిస్తున్న చేత సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ టోర్నీలో పది టీమ్స్ 70 మ్యాచ్లు 52 రోజులపాటు ఆడనున్నాయి. దేశంలోని 12 స్టేడియాలలో ఈ ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే… ఈసారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితిలో నెలకొన్నాయి. ఈ సీజన్ ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో టాప్ హీరోయిన్స్ రష్మిక మందన్న, తమన్నా పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయ ఈ మేరకు వాళ్ళిద్దరితోను సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో పెర్ఫార్మ్ చేయడానికి వారిద్దరు అంగీకరించినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version