IPL 2023: చెన్నై గెలవాలంటే బౌలింగ్ లో సత్తా చాటాలి… !

-

అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో అంగరంగ వైభవంగా ఐపీఎల్ సీజన్ 16 మొదలైంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్యన జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అందరూ చెన్నై గెలుస్తుంది అనుకున్నారు.. జరగాల్సింది కూడా అదే.. కానీ డెత్ బౌలింగ్ లో ఘోర వైఫల్యం కారణంగా అయిదు వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. బ్యాటింగ్ లో అంచనాలకు తగినట్లు రాణించగల సమర్థులు ఉన్నప్పటికీ.. బౌలింగ్ లో లోపమే చెన్నై ఓటమికి కారణం అయింది.

ముఖ్యంగా సీనియర్ బౌలర్ గా జట్టులో ఉన్న దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలు పూర్తిగా తేలిపోయారు. దీపక్ చాహర్ చివర్లో సరిగా బౌలింగ్ చేసుంటే మ్యాచ్ గెలిచేది. కాబట్టి మొదటి మ్యాచ్ లో కీలకంగా మారిన బౌలింగ్ ను సరిచేసుకుంటే నేటి మ్యాచ్ లో లక్నో పై గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూద్దాం చెన్నై మొదటి విజయాన్ని నమోదు చేస్తుందా ?

Read more RELATED
Recommended to you

Exit mobile version