ఐపిఎల్ సీజన్ 16 ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ లతో అభిమానులను ఎంతగానో రంజింపచేస్తోంది. కొన్ని మ్యాచ్ లు అయితే ఆఖరి బంతి వరకు సాగుతూ నరాలు తెగే ఉత్కంఠను అందిస్తున్నాయి. ప్రతి జట్టు కూడా ఎంతో కసిగా ఐపిఎల్ సీజన్ 16 టైటిల్ ను అందుకోవాలని ఆడుతున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం బెంగళూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్యన భారీ మ్యాచ్ జరగనుంది. ఎప్పుడూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. ఈసారి కూడా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2023: మోస్ట్ అవెయిటింగ్ మ్యాచ్ నేడే… “ధోనీ vs కోహ్లీ” పోరుకు సర్వం సిద్దం !
-