అమేజింగ్ టాలెంట్: సైలెంట్ గా దూసుకెళ్తున్న చెన్నై యంగ్ బౌలర్ !

-

ఐపీఎల్ సీజన్ 16 లో చెన్నై సూపర్ కింగ్స్ తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు గెలిచి నాలుగింట ఓడింది. కాగా ఈ విజయాలలో బ్యాట్స్మన్ ల పాత్ర ఎంత ఉందో , బౌలర్లు కూడా అంతే పాత్రను పోషించి విజయాలలో పాలు పంచుకున్నారు. కాగా చెన్నై టీం లో ఉన్న యంగ్ బౌలర్ తుషార్ దేశ్ పాండే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ ను అందుకోవడానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ఐపీఎల్ లో ఎక్కువ ఎకానమీ రేట్ తో పరుగులు ఇచ్చుకుంటూ కొన్ని మ్యాచ్ లు ఓడిపోవడానికి కారణం అయ్యాడు.

కానీ డెత్ ఓవర్ లలో కట్టుదిట్టంగా పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సీజన్ లో వికెట్లు సాధిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇతని తర్వాత స్థానంలో సిరాజ్ 15 , అర్ష్ దీప్ 15 వికెట్లు సాధించి రెండు మూడు స్థానాలలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version