IPL 2023 షెడ్యూల్ విడుదల.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..?

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఐపిఎల్ 2023 సీజన్ మ్యాచ్ ల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా ముగిశాయి.

దాంతో 16వ సీజన్ షెడ్యూల్ ని ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ల బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. మార్చి 31వ తేదీన తొలి మ్యాచ్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ధోని కెప్టెన్సీ వహిస్తున్న చేత సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ టోర్నీలో పది టీమ్స్ 70 మ్యాచ్లు 52 రోజులపాటు ఆడనున్నాయి. దేశంలోని 12 స్టేడియాలలో ఈ ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news