ఐపీఎల్ మినీ వేలం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు …. దుబాయ్ లోని కోకా కోలా అరేనలో జరగబోతుంది. విదేశాలలో వేలం జరగడం ఇదే తొలిసారి. ఈ వేలంని జియో సినిమా మరియు స్టార్ స్పోర్ట్స్ లో ప్రేక్షకులు వీక్షించవచ్చు.
అయితే రేపు జరగబోయే మినీ వేలమును మహిళ యాక్ష నీర్ నిర్వహించబోతున్నారు .ఆమె పేరు మల్లికా సాగర్ అద్వానీ. ఇంతకుముందు సీజన్లకు యాక్షనీర్గా వ్యవహరించిన హ్యూ ఎడ్మిడ్స్ స్థానంలో ఈమె నిర్వహించనున్నారు. దీంతో వేలంని నిర్వహించే తొలి మహిళగా రికార్డులోకి ఎక్కారు. ఇంతకుముందు నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ కి ఆక్షన్నీర్ గా పనిచేశారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈమె గురించి గూగుల్ లో వెతకడం ప్రారంభించారు. ఈమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది.
మల్లికా సాగర్ ముంబైకి చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. 48 ఏళ్ల మల్లికాకు వేలంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్చాతుర్యంతో అందరిని అకట్టుకున్నారు. ఆ తర్వాత Wpl మొదటి సీజన్ కి సంబంధించిన వేలాన్ని నిర్వహించారు. ఆ తర్వాత wpl 2024 వేలం మరియు ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంనిర్వహించారు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2024వేలంను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.