IPL 2024 : రాణించిన బౌలర్లు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

చెన్నై ఓపెనర్లు రహానే , గైక్వాడ్ 50 బంతుల్లో 64 పరుగులు చేసి శుభారంబాన్ని అందించారు.రహానే 24 బంతుల్లో 29 పరుగులు చేయగా,గైక్వాడ్ 62 రన్స్ చేశాడు.ఇక ఆ తర్వాత వచ్చిన దూబే డక్ అవుట్ అయ్యాడు. జడేజా రెండు పరుగులు చేయగా, రిజ్వి 21 పరుగులు చేశాడు.చివర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ (14) కూడా మెరుపులు మెరిపించలేకపోయారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో బ్రార్, రాహుల్ చాహర్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే పంజాబ్ కింగ్స్పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 163 రన్స్ చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version